యష్ భారీ సినిమాలో షారుఖ్? క్లారిటీ ఇచ్చేసిన యష్

యష్ భారీ సినిమాలో షారుఖ్? క్లారిటీ ఇచ్చేసిన యష్

Published on Feb 15, 2024 9:00 AM IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా కేజీయఫ్ సిరీస్ తో తన కి పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి క్రేజ్ వచ్చిందో తెలిసిందే. దీనితో ఈ రెండు సినిమాల హైప్ ని మ్యాచ్ చేసేలా ఏ సినిమా చేస్తాడా అనే చాలా సస్పెన్స్ తర్వాత దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన “టాక్సిక్” అనే చిత్రం ఆ హైప్ ని అందుకుంది.

మరి ఈ సినిమాపై గట్టి హైప్ ఇపుడు నెలకొనగా ఈ చిత్రం విషయంలో గత కొన్నాళ్ల నుంచి పలు క్రేజీ రూమర్స్ బయటకి వచ్చి వైరల్ గా మారాయి. మరి వీటిలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కామియో రోల్ లో కనిపించనున్నారని వచ్చిన వార్తలు వైరల్ గా మారాయి.

అయితే దీనిపై ఇప్పుడు స్వయంగా యష్ నే క్లారిటీ ఇచ్చాడు. లేటెస్ట్ గా జరిగిన ఓ మీడియా ఇంటరాక్షన్ లో ఈ రూమర్స్ పై మాట్లాడుతు ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తమ నుంచి అధికారికంగా ఏ న్యూస్ వచ్చేవరకు ఏది నమ్మవద్దని తాను తెలిపాడు. దీనితో షారుఖ్ కానీ ఏ ఇతర న్యూస్ అయినా కూడా తమ నుంచి అఫీషియల్ గా వస్తే తప్ప నమ్మడానికి లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు