ఈ సినిమాకే ఇలా ఉంటే “కేజీయఫ్ 2″కి ఎలా ఉంటుందో?

Published on Mar 5, 2021 9:00 am IST

కొన్ని సినిమాలతో ఓ హీరో స్టేటస్ ఒక్కసారిగా మరో లెవెల్ లోకి వెళ్ళిపోతుంది. మరి అలాంటి సినిమా ఒకటి “కేజీయఫ్” అయితే ఆ హీరో యష్ అని చెప్పాలి. కన్నడకు చెందిన ఈ సినిమా పాన్ ఇండియన్ లెవెల్లో ఎలాంటి సెన్సేషన్ ను నమోదు చేసి ఇప్పుడు చాప్టర్ 2పై అంచనాలు ఏర్పడేలా చేసిందో తెలుసు. మరి అలాగే ఈ సినిమాకు ఇంతలా క్రేజ్ రావడానికి కారణం దర్శకుడు ప్రశాంత్ నీల్ డిజైన్ చేసిన రాకీ భాయ్ రోల్.

దీనిలో యష్ సరిగ్గా సెట్టయ్యి తన మార్కెట్ ను కూడా ఓ రేంజ్ లో పెంచుకున్నాడు. అయితే అది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గట్టిగానే ఉన్నట్టు తెలుస్తుంది.ఈరోజు విడుదల కావస్తున్న తాను ఎప్పుడో ఏడేళ్ల కితం చేసిన “గజకేసరి” అనే సినిమాకు 300కి పై చిలుకే థియేటర్స్ దక్కాయి.

థియేటర్స్ కు ఎంత మేర జనం వస్తారో ఏమో కానీ ఇది మాత్రం ప్యూర్ యష్ క్రేజ్ అనే అతని అభిమానులు అంటున్నారు. అయితే మరి ఈ సినిమాకే ఇన్ని థియేటర్స్ దక్కితే ఇక రాబోయే “కేజీయఫ్ చాప్టర్ 2″కు ఏ రేంజ్ లో ఉంటుందో కూడా ఊహించలేం అని చెప్పాలి.మరి అప్పటికి ఇంపాక్ట్ ఏ లెవెల్లో ఉంటుందో తెలియాలి అంటే జూలై 16వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :