‘రామాయణ’ 4000 వేల కోట్ల బడ్జెట్ పై క్లారిటీ ఇచ్చిన యష్!

‘రామాయణ’ 4000 వేల కోట్ల బడ్జెట్ పై క్లారిటీ ఇచ్చిన యష్!

Published on Aug 16, 2026 8:04 PM IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన టాక్సిక్ ఇప్పుడు విడుదలకి దగ్గరలో ఉంది. ఈ సినిమా తర్వాత తాను విలన్ రోల్ లో నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ వరల్డ్ చిత్రం ‘రామాయణ’ కూడా రాబోతుంది. అయితే ఈ సినిమాని హాలీవుడ్ అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించిన నేపథ్యంలో మేకర్స్ కూడా ఈ సినిమాకి బడ్జెట్ ఏకంగా 4000 కోట్లు పెట్టామనే మాట ఒక్కసారిగా షాకింగ్ గా మారింది. యష్ తో సహ నిర్మాత అయినటువంటి నమిత్ మల్హోత్రా ఇచ్చిన స్టేట్మెంట్ పై యష్ అసలు క్లారిటీ ఇచ్చాడు.

రామాయణ కి 4000 కోట్లు బడ్జెట్ అనే మాట కేవలం ఒక్క సినిమాకి సంబంధించింది కాదు అని రెండు భాగాలకు కలిపిన బడ్జెట్ మాత్రమే కాకుండా సినిమాకి జరిగిన ఇతర ఖర్చులు, వరల్డ్ వైడ్ ప్రమోషన్స్ అన్నీ కలిపి ఒక హాలీవుడ్ సినిమాకి ఏ తరహాలో ఖర్చు చేస్తారో అలానే చేశామని అది అసలు ఉద్దేశం అని రివీల్ చేసాడు. దీనితో రామాయణ బడ్జెట్ పై ఓ క్లారిటీ బయటకి వచ్చింది. ఇక రామాయణ సినిమా ఈ ఏడాది నవంబర్ 8న ఇండియాలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు