“కేజీయఫ్ 2” కోసం యష్ సాలిడ్ వర్కౌట్స్ ఇవే.!

Published on Sep 30, 2020 3:40 pm IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం “కేజీయఫ్”. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా ప్లాన్ చేసిన ఈ చిత్రం విడుదల కాబడిన అన్ని చోట్లా కూడా వసూళ్ల దుమ్ము లేపేసింది. దీనితో ఈ భారీ ప్రాజెక్ట్ సీక్వెల్ పై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఇపుడు రానున్న చాప్టర్ 2 కోసం హీరో యష్ తన లుక్ ను మరింత సాలిడ్ గా ప్రిపేర్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ లుక్ కోసం యష్ గట్టిగానే కసరత్తులు చేస్తున్నాడని తెలుస్తుంది. ప్రతీ రోజు ఉదయమే 6 గంటలకు జిమ్ లో చెస్ట్ వర్కౌట్స్ తో మొదలు పెడుతున్నాడట. అలాగే దానితో పాటుగా తన యాబ్స్ ను కూడా స్ట్రాంగ్ గా ప్రిపేర్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇదంతా ఉదయపు సెషన్ అయితే సాయంత్రం సెషన్లో కూడా అనేక రకాల వర్కౌట్స్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇదంతా తనకి ప్రతినాయకుని పాత్రలో కనిపించనున్న అధీరా రోల్ కోసమే అన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ పవర్ ఫుల్ రోల్ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ భారీ ప్రాజెక్ట్ ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More