రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘టాక్సిక్’ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ నెలకొల్పిందో అందరికీ తెలిసిందే. బోల్డ్ టీజర్లతో ఈ మూవీ యూత్‌లో హైప్ పీక్స్‌లో సెట్ చేసింది. గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రెస్టీజియస్ చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బెంగళూరులో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఇక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఈ ట్రైలర్‌ను పలు భాషల్లో రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్‌లో యష్ ఊరమాస్ లుక్, పవర్‌ఫుల్ డైలాగ్స్, రా యాక్షన్ సీక్వెన్సెస్ మాస్ ఆడియెన్స్‌ను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక హాలీవుడ్ రేంజ్ విజువల్స్, మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 4.38 నిమిషాల ఈ ట్రైలర్ సినిమా కథను వివరిస్తూనే యష్ బాక్సాఫీస్ దగ్గర చేయబోయే ఊచకోత ఏ రేంజ్‌లో ఉండబోతుందో తెలిపింది.
ఇక ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీ, తారా సుతారియా వంటి భారీ క్యాస్టింగ్ నటిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, ట్రైలర్‌తోనే సినిమాపై అంచనాలను ఆకాశానికెత్తేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆగస్టు 26న ఈ చిత్రాన్ని అత్యంత భారీస్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


