కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, తారా సుతారియా అలాగే నయనతార, హుమా ఖురేషి కలయికలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన భారీ చిత్రమే ‘టాక్సిక్’. మంచి హైప్ ఉన్న ఈ సినిమా చాలా కాలం జాప్యం తర్వాత ఇప్పుడు విడుదలకి వస్తుంది.
అయితే మేకర్స్ ఈ సినిమాని కన్నడ, ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ ఏకకాలంలో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దీనితో హాలీవుడ్ రిలీజ్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఈ రిలీజ్ కి హాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ కోసం చూసారు. ఇంకోపక్క ఓటిటి డీల్ కూడా కాకపోవడంతో సినిమా ఇంత ఆలస్యం అయ్యింది అని తెలిసిందే.
కానీ ఫైనల్ గా వీరికి ప్రముఖ హాలీవుడ్ సంస్థ లయన్స్ గేట్ వారు డిస్ట్రిబ్యూటర్ గా దొరికారు కానీ ఇంకా ఓటిటి డీల్ పూర్తి కాలేదు అని తెలుస్తుంది. మేకర్స్ అడుగుతున్న మొత్తంలో ఆఫర్ రాకపోవడంతోనే టీవీ, ఓటిటి హక్కులు బిజినెస్ చేయకుండానే థియేటర్స్ లో సినిమాని విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి రిలీజ్ అయ్యాక ఏమన్నా లెక్కలు మారుతాయేమో చూడాలి.


