కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా హీరోయిన్స్ నయనతార, కియార అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ తదితరులు నటిస్తున్న భారీ చిత్రమే టాక్సిక్. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో యష్ డబుల్ రోల్ చేశారు. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, గ్లింప్స్ లకి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక అంతా నెక్స్ట్ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు.
మరి ఈ ట్రైలర్ డేట్ కూడా లాక్ అయినట్లు తెలుస్తోంది. ట్రైలర్ ని మేకర్స్ బెంగళూరులో గ్రాండ్ ఈవెంట్ నడుమ ఈ మార్చ్ 8న విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. సో దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు అలాగే కె వి ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణం వహించారు. పాన్ ఇండియా లెవెల్లో ఈ 19న విడుదల కాబోతోంది.
