“యాత్ర 2” ఓటిటి లోకి వచ్చేది అప్పుడే?

“యాత్ర 2” ఓటిటి లోకి వచ్చేది అప్పుడే?

Published on Feb 26, 2024 11:05 PM IST

మాలీవుడ్ స్టార్ మమ్ముట్టి మరియు కోలీవుడ్ నటుడు జీవా ప్రధాన పాత్రల్లో నటించిన పొలిటికల్ డ్రామా యాత్ర 2 ఫిబ్రవరి 8, 2024న థియేటర్లలో విడుదలై, ప్రేక్షకులను ఆకట్టుకుంది. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా యొక్క డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం ఓటిటి రాక మరోసారి హాట్ టాపిక్ గా మారుతోంది. మార్చి 8, 2024 నుండి డిజిటల్ ప్రీమియర్ గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రంలో మమ్ముట్టి మరియు జీవాతో పాటు, కేతకి నారాయణ్, సుజానే బెర్నెర్ట్, మహేష్ మంజ్రేకర్, అశ్రిత వేముగంటి నండూరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. V సెల్యులాయిడ్ మరియు త్రీ ఆటం లీవ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు