ఫ్యాన్స్ కు యాత్ర డైరెక్టర్ పిలుపు: విభేదాలు పక్కన పెట్టండి !

Published on Feb 6, 2019 2:48 pm IST

యాత్ర డైరెక్టర్ మహి వి రాఘవ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. వైఎస్సాఆర్ జీవితం ఆధారంగా తాను డైరెక్ట్ చేసిన బయోపిక్ ‘యాత్ర’ విడుదల దగ్గర పడుతుండటంతో సినిమాను పార్టీలకు అతీతంగా సినిమా ఆదరించాలని ఎన్టీఆర్, వైఎస్సాఆర్ ఇద్దరు తెలుగుజాతి గర్వించదగ్గ మహానుభావులని అభిప్రాయభేదాలు, ద్వేషాలను పక్కన పెట్టి ఈ సినిమాను ఆదరించాలని ఆయన లేఖ ద్వారా పిలుపునిచ్చారు.

వైఎస్సాఆర్, చిరంజీవిల మీద ఉన్న అభిమానం తనలో ఏనాడూ ఇతరులపై ద్వేషం పెంచలేదని అన్నారు. సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అన్న ఉత్కంఠ పెరుగుతోందని ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు.

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈనెల 8న తెలుగు తో పాటు మలయాళ , తమిళ భాషల్లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :