ఆశ్చర్యాన్ని కలిగిస్తోన్న ‘యాత్ర’ రన్ టైం ?
Published on Jan 13, 2019 1:22 am IST

దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డిగారి బయోపిక్ ను ‘యాత్ర’ పేరుతో మహి.వి.రాఘవ్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం రన్ టైం కేవలం గంటా ఏభై ఐదు నిమిషాలు మాత్రమే అని తెలుస్తోంది. బయోపిక్ అనగానే సహజంగా మూడు గంటలు తక్కువ నిడివి ఉండదు అనుకుంటాం, కానీ యాత్ర రన్ టైం మరి ఇంత తక్కువా అని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరి ఇంత తక్కువ రన్ టైంలో ఏం చూపించారో తెలియాలంటే సినిమా విడుదల దాకా ఆగాల్సిందే.

ఇక ‘యాత్ర’ చిత్రం ఫిబ్రవరి 8న విడుదలవుతుంది. ఈ సినిమాలో వైఎస్సార్ తండ్రి రాజారెడ్డిగారి పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. అలాగే సుహాసిని, పోసాని కృష్ణ మురళి, రావు రమేష్ లతో పాటు రంగస్థలం చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న అనసూయ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డిలు నిర్మిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook