‘ది ప్యారడైజ్’ ఫోక్ సాంగ్.. నెగిటివ్ నుంచి మొదలై ఆల్ టైం రికార్డు!

నాచురల్ స్టార్ నాని హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన భారీ చిత్రమే ది ప్యారడైజ్. మంచి హైప్ ఉన్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా తన నుంచి కేవలం రెండే పాటలు ఇప్పుడు వరకు వచ్చాయి.

అయితే ఈ రెండూ కూడా సెన్సేషనల్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇటీవల వచ్చిన ఏశ నాగుల అనే ఫోక్ సాంగ్ అయితే నెగిటివ్ నుంచి మొదలై ఇప్పుడు ఆల్ టైం రికార్డు సెట్ చేసినట్టు తెలుస్తుంది. సాంగ్ వచ్చిన రోజు పలు డిఫరెంట్ కామెంట్స్ వినిపించాయి కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఈ సాంగ్ టాలీవుడ్ నుంచి ఫాస్టెస్ట్ 100 మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్ గా నిలిచినట్టు తెలుస్తుంది.

కేవలం 17 రోజుల్లోనే ఈ సాంగ్ రికార్డు క్రియేట్ చేయగా దీనికి ముందు ఊ అంటావా సాంగ్ 19 రోజులతో ఉంది. సో మొత్తానికి మ్యూజికల్ గా ప్యారడైజ్ మేనియా మామూలు లెవెల్లో లేదని చెప్పొచ్చు. ఇక ఈ సెప్టెంబర్ 24న వచ్చే సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version