తమిళనాట దుమ్ములేపుతున్న తెలుగు హీరోయిన్

Hasika
‘బస్ స్టాప్’, ‘గ్రీన్ సిగ్నల్’ మరియు వరుణ్ సందేశ్ ‘ప్రియతమా నీవచట కుశలమా’ సినిమా ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన రక్షిత/ హన్సిక తమిళనాట కూడా బాగా పాపులర్ అవుతుంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాయల్’ సినిమాతో రొమాంటిక్ విజయాన్ని సాధించింది.

హాసిక తన పేరుని ఆనందిగా మార్చుకుని తమిళ ప్రముఖ బ్యానర్ లలో మంచి మంచి చిత్రాలలో నటించింది. ఇప్పుడు కాయల్ విజయం తరువాత నటుడు కమ్ సంగీత దర్శకుడు అవతారమెత్తిన జీ.వి ప్రకాష్ కుమార్ కు జంటగా ‘త్రిష ఇలియానా నయనతార’ సినిమాలో నటించనుంది.

స్వాతీ, శ్రీ దివ్య, బిందుమాధవిల కోవలకి ఇప్పుడు హాసిక కూడా చేరిందని సినీ పండితుల విశ్లేషణ.

Exit mobile version