ఫిబ్రవరిలో ‘ఎవడే సుబ్రమణ్యం’..!

ఫిబ్రవరిలో ‘ఎవడే సుబ్రమణ్యం’..!

Published on Jan 24, 2015 11:24 AM IST

Yevade-Subramanyam
యువ హీరో నాని నటించిన తాజా సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. మౌంట్ ఎవరెస్ట్ వద్ద బేస్ క్యాంపులో షూటింగ్ జరిపిన తొలి సినిమాగా రికార్డుకెక్కింది. ఆ సినిమాలు సినిమాకు హైలైట్ అవుతాయని చిత్ర బృందం భావిస్తుంది.

స్వప్న సినిమా పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శేఖర్ కమ్ముల శిష్యుడు నాగ్ అశ్విన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రితు వర్మ, మలయాళ భామ మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు రాకేశ్ – నవీన్ సినిమాటోగ్రాఫర్స్ గా పని చేస్తున్నారు. సినీ గాలక్సీ సంస్థ ఈ సినిమా అమెరికా డిస్ట్రిబ్యూషన్ హక్కులు దక్కించుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు