యోగానే నా ఆరోగ్య రహస్యం – దాసరి

dasari-narayan-rao
దర్శకరత్న డా. దాసరి నారాయణరావు ఈ రోజు తన 70వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ విలక్షణ దర్శకుడు తన కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలను చూసాడు అందుకే ఆయన ఇండస్ట్రీలో ప్రముఖ వ్యక్తిగా స్థానం సంపాదించుకున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే 70 ఏళ్ళ వయస్సు వచ్చినా దాసరి ఎలా ఇంత యాక్టివ్ గా ఉండగలుగుతున్నాడు.?

ఇదే ప్రశ్నని దర్శకరత్న ముందు ఉంచితే ‘ప్రతి రోజూ యోగా చేయడం, అలాగే నా ఆహార అలవాట్లే నా ఆరోగ్యం యొక్క రహస్యమని’ సమాధానం చెప్పాడు. ప్రస్తుతం దాసరి తన పెద్ద కుమారుడు హీరోగా ఓ సినిమాని నిర్మించనున్నాడు. అలాగే దాసరి ఈ సంవత్సరం సినిమాల్లో నటించడానికి కూడా సిద్దమవుతున్నాడు.

ఈ సందర్భంగా ఆయన కెరీర్ కి గుడ్ లక్ చెబుతూ దర్శకరత్న దాసరికి 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Exit mobile version