విష్ణులో శోభన్ బాబుని చూడొచ్చు – దాసరి

Erra-Bus-Audio-Launch
దర్శకరత్న దాసరి నారాయణరావు ‘ఎర్రబస్సు’ సినిమాతో మంచు విష్ణు నటుడిగా అందరి నుంచి ప్రశంశలు అందుకుంటాడని ఇది వరకు చెప్పారు. తాతా మనవళ్ళ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఓ సెంటిమెంట్ టచ్ తో పాటు ఎక్కువగా ఎమోషనల్ సీన్స్ కూడా ఉండనున్నాయి. దాంతో విష్ణు నటనకి చాలా ప్రాధాన్యత ఉన్న పాత్రని, తను చాలా బాగా చేసాడని ఈ చిత్ర టీం చెబుతోంది.

దాసరి నారాయణరావు దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలతో పాటు విష్ణుకి తాతయ్యగా నటించనున్నాడు. చక్రి అందించిన ఆడియో గత శుక్రవారం విడుదలైంది. దాసరి మాట్లాడుతూ ‘ఎర్రబస్సు లో విష్ణు తన నటనతో మీ మనసుల్ని గెలుచుకుంటాడు. ఈ మూవీలో విష్ణు పెర్ఫార్మన్స్ చూస్తున్నప్పుడు మీకు శోభన్ బాబు నటనని గుర్తుకు తెస్తుందని’ అన్నాడు.

‘ఎర్రబస్సు’లో మంచు విష్ణు సరసన కేథరిన్ ట్రేస హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా చిల్డ్రన్స్ కానుకగా నవంబర్ 14న రిలీజ్ కానుంది.

Exit mobile version