
‘అవును’, ‘అవును 2’ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు హర్షవర్ధన్ రానే. ఈ మధ్యనే విడుదలైన ‘అవును 2’లోని అతడి నటనకు అటు పరిశ్రమ నుంచి, ఇటు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా తర్వాత అతడికి మంచి అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్లో కొన్ని అవకాశాలు రాగా తాజాగా తెలుగులో మరో భారీ సినిమాలో నటించే అవకాశం దక్కింది.
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తుండగా, సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘బెంగాల్ టైగర్’ సినిమాలో ఓ కీలకపాత్రకు హర్షవర్ధన్‌ను ఎంపిక చేశారు. ఈ సినిమాలో హర్షది మంచి ఆసక్తి రేకెత్తించే పాత్రగా చెప్పబడుతోంది. హర్షవర్ధన్, రాశిఖన్నా, రవితేజల మధ్య ఆసక్తికర ట్రయాంగిల్ లవ్‌స్టోరీ ప్లాన్ చేసినట్లు సమాచారం. బెంగాల్ టైగర్ షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. వినాయక చవితికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.