విలక్షణ నటుడిగా దూసుకుపోతున్న యువ నటుడు !

CharanSurineni

‘బాహుబలి’లో కాలకేయ తమ్ముడిగానూ, ‘పీఎస్వీ గరుడవేగ’లో పోలీస్ పాత్రలోనూ ప్రేక్షకులను మెప్పించాడు చ‌ర‌ణ్‌ సూరినేని. వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’లో మెయిన్ విలన్ గా నటించిన చ‌ర‌ణ్‌ దీప్‌కి చక్కటి గుర్తింపు వచ్చింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లో ప్రతిభ చాటుతున్న చరణ్ సూరినేని తాజాగా సరికొత్త మేకోవ‌ర్‌లోకి వచ్చాడు. జుట్టు బాగా పెంచి, కొంచెం గడ్డంతో స్టైల్‌గా కనిపిస్తున్నాడు.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక ‘సైరా నరసింహారెడ్డి’, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కల్కి’ చిత్రాల్లో చరణ్ దీప్ నటిస్తున్నాడు. ఈ శుక్రవారం విడుదలవుతున్న ‘సీమరాజా’లో చరణ్ సూరినేని కీలక పాత్రలో నటించాడు.

ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు, మేకోవర్ గురించి చరణ్ సూరినేని మాట్లాడుతూ “రాజశేఖర్ గారు, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘కల్కి’లో నేను పోలీస్ పాత్రలో నటిస్తున్నా. ‘గరుడవేగ’లో నాది పాజిటివ్ క్యారెక్టర్ అయితే… ‘కల్కి’లో నెగిటివ్ క్యారెక్టర్. ఈ సినిమాతో పాటు చిరంజీవిగారితో ‘సైరా నరసింహారెడ్డి’లో నటిస్తున్నా. అలాగే, తమిళంలోనూ నాకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ‘సీమ రాజా’లో నా పాత్రకూ మంచి స్పందన వచ్చింది. శుక్రవారం ఈ సినిమా తెలుగులో విడుదల అవుతుండటం సంతోషంగా ఉంది. ప్రస్తుతం తమిళంలో ఓ భారీ సినిమాలో నటిస్తున్నా. తెలుగులో, తమిళంలో నాకు మంచి మంచి పాత్రలు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నా దర్శక, నిర్మాతలకు థాంక్స్” అన్నారు.

Exit mobile version