
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాస్ మసాలా డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం ఇదివరకే తెలియజేశాం. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి పోటీని ఇచ్చే ఓ నెగటివ్ రోల్ కోసం యంగ్ హీరోని సెలక్ట్ చేసాడు బోయపాటి శ్రీను. ఆ యంగ్ హీరోనే మన తెలుగువాడైన ఆది పినిశెట్టి. ‘ఒక V చిత్రం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఆది ఆ తర్వాత ‘గుండెల్లో గోదారి’, ‘ఏకవీర’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం ఉన్నాడు. తను చేసిన ‘మలుపు’ సినిమా కూడా త్వరలోనే రిలీజ్ కానుంది.
అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను సినిమా జూలై 26 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. మొదటగా ఓ యాక్షన్ ఎపిసోడ్ తో ఈ సినిమాని షూట్ చేయనున్నారు. బోయపాటి శ్రీను క్రియేట్ చేసిన ఈ క్రేజీ కాంబినేషన్ పై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. అల్లు అర్జున్ ఈ సినిమాలో టోటల్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు, అందులో భాగంగా అల్లు అర్జున్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ ట్రేస హీరోయిన్స్ గా కనిపించనున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించనున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్.

