రజనీ కాంత్ సినిమాలో హీరోయిన్ ఎవరంటే..!

rajinikanth
సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమా అంటే బాక్సాఫీస్‌కు పండగే. అయితే ఆయన గత చిత్రాలైన ‘కొచ్చాడయాన్’ (విక్రమ సింహ), ‘లింగా’ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసి రజనీకి పెద్ద పరీక్ష పెట్టాయి. దీంతో కొత్తతరం దర్శకులైతే తనను మళ్ళీ కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారన్న ఆలోచనలో రజనీ.. ‘అట్టకత్తి’, ‘మద్రాస్’ సినిమాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు రంజిత్‌ దర్శకత్వంలో ఓ సినిమాను అంగీకరించిన విషయం తెలిసిందే.

ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి థాను ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారన్న విషయంపై కూడా ఇప్పటివరకూ చాలా వార్తలే వినిపించగా, చివరకు రాధికా ఆప్టేను ఖరారు చేశారు. ‘రక్త చరిత్ర’, ‘లెజెండ్’ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాధికా, ఈ మధ్యే విడుదలైన తన షార్ట్‌ఫిల్మ్ ‘అహల్య’తో సంచలనం సృష్టించారు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో రజనీ తన వయసుకు సరిపోయే తరహా పాత్రను చేయనున్నట్లు తెలుస్తోంది. ఓ వయసైన గ్యాంగ్‌స్టర్‌గా రజనీ ఈ సినిమాలో కనిపించనున్నారట.

Exit mobile version