రెమ్యునరేషన్ పెంచిన రాశీఖన్నా?

Rasi-kanna
ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన భామ రాశీఖన్నా ఆనతికాలంలోనే మంచి పాపులర్ అయ్యింది. తాను నటించిన ‘జోరు’ సినిమా బోరు కొట్టించినా ఇటీవల విడుదలైన ‘జిల్’ సినిమాలో అందాల ఆరబోతతో ప్రేక్షకుల మతినిపోగొట్టేసింది. దీంతో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న రాశీ డిమాండ్ ఇప్పుడు బాగా పెరిగినట్టు సమాచారం.

తదుపరి సంతకం చేయబోయే సినిమాలకు రెమ్యునరేషన్ పెంచనున్నట్టు సమాచారం. దాదాపు సినిమాకు యాభై లక్షలు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రాశీ ప్రస్తుతం రవితేజతో కలిసి ‘బెంగాల్ టైగర్’ సినిమాలో నటిస్తుంది. రచ్చ సినిమా తీసిన సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకుడు. రాశీకి మంచి విజయాలు సాధించి మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుందాం.

Exit mobile version