యంగ్ బ్యూటీ డిమాండ్స్ ఎక్కువయ్యాయి !

Published on Mar 8, 2021 10:32 am IST

యంగ్ బ్యూటీ కృతి శెట్టి టాలీవుడ్ లో ఉప్పెన సినిమా‌తో ఎంట్రీ ఇవ్వనుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే నాని సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఆలాగే ఫామ్ లో ఉన్న యంగ్ హీరోల స‌ర‌స‌న వ‌ర‌స‌గా అవ‌కాశాలు వస్తున్నాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం కృతిశెట్టి ప్రస్తుతం ఒక సినిమాకి ఏకంగా కోటి రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ అడుగుతుంద‌ట‌. అలాగే కృతి శెట్టి డిమాండ్స్ కూడా ఎక్కువుగా ఉన్నాయట.

మరి ఈ రెండు సినిమాలు కూడా రిలీజ్ కాకుండానే ఆమె డిమాండ్స్ ఎక్కువ అవ్వడం ఆమె కెరీర్ కి ఎంతవరకూ మైనస్ అవుతుందో చూడాలి. అయితే తన నటనతో ఆమె మెప్పించే నటి కాబట్టి ఆమెకు అవకాశాలు ఇంకా పెరగడం ఖాయం. అలాగే తాజాగా సూర్య – హరి కలయికలో రాబోతున్న యాక్షన్ డ్రామాలో కూడా కృతి శెట్టికి హీరోయిన్ గా అవకాశం వచ్చిందని రూమర్స్ ఉన్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు గాని, మొదటి సినిమా రిలీజ్ కాకుండానే కృతి శెట్టికి ఓ రేంజ్ లో అవకాశాలు వస్తున్నాయి.

సంబంధిత సమాచారం :