మెగాస్టార్ ‘విశ్వంభర’ లో కీలక పాత్ర చేస్తున్న యంగ్ బ్యూటీ ?

మెగాస్టార్ ‘విశ్వంభర’ లో కీలక పాత్ర చేస్తున్న యంగ్ బ్యూటీ ?

Published on Feb 21, 2024 12:07 AM IST

మెగాస్టార్ చిరంజీకి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర షూటింగ్ తాజాగా ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం అమెరికా లో ఉన్న మెగాస్టార్ తిరిగిరాగానే ఈ నెలాఖరు వారంలో నెక్స్ట్ షెడ్యూల్ ఆరంభం కానున్నట్లు తెలుస్తోంది. విషయం ఏమిటంటే, త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో యంగ్ బ్యూటీ సుర్బి పురానిక్ ఒక కీలక పాత్రకు ఎంపికైనట్లు తెలుస్తోంది.

గతంలో బీరువా, ఒక్క క్షణం, ఎక్స్ ప్రెస్ రాజా వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఆకట్టుకున్నారు సుర్బి. యువి క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న విశ్వంభరకు కీరవాణి సంగీతం అందిస్తుండగా చోటా కె నాయుడు ఫోటోగ్రఫి అందిస్తున్నారు. ఇక ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి వచ్చే ఏడాది సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు