మెగాస్టార్ “విశ్వంభర” రూమర్స్ పై క్లారిటీ ఇదే!

మెగాస్టార్ “విశ్వంభర” రూమర్స్ పై క్లారిటీ ఇదే!

Published on Dec 10, 2023 4:00 PM IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు చేస్తున్న మాసివ్ ప్రాజెక్ట్ కోసం అందరికీ తెలిసిందే. తన కెరీర్ 156 వ సినిమాగా యంగ్ దర్శకుడు వశిష్ట ఈ చిత్రాన్ని తెరక్కిస్తున్నట్టుగా తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ కూడా రీసెంట్ గానే స్టార్ట్ కాగా ఈ షూట్ విషయంలో అప్డేట్ బయటకి వచ్చింది.

మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ విషయంలో ఉన్న కొన్ని రూమర్స్ పై యంగ్ దర్శకుడు రీసెంట్ గా స్పందించాడు. ఈ సినిమా ఆ సినిమాకి సీక్వెల్ ఈ సినిమాకి సీక్వెల్ అని వచ్చిన వార్తలు ఏవి కూడా నిజం కాదు అని తేల్చేసాడు. ఇది పూర్తిగా కొత్త కథే అని దేనికి కూడా సీక్వెల్ కాదని కన్ఫర్మ్ చేసాడు.

అలాగే ఈ సినిమాలో ఆయన్ని ఎలా చూడాలి అనుకుంటున్నారో అదీ ఉంటుంది దానితో పాటుగా నేను అనుకున్న ఫాంటసీ కూడా ఉంటుంది అని క్రేజీ అప్డేట్స్ అందించాడు. సో ఈ సినిమాపై వచ్చిన ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు