‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ట్రైలర్ పై యంగ్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ట్రైలర్ పై యంగ్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Apr 3, 2024 10:29 PM IST

అంజలి ప్రధాన పాత్రలో శివ తుర్లపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ కామెడీ హర్రర్ జానర్ మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ మూవీని ఎంవివి సినిమా, కోన ఫిలిం కార్పొరేషన్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నాయి. ఇక ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ అందరినీ ఆకట్టుకోగా నేడు ట్రైలర్ ని రిలీజ్ చేసారు. యక్షన్ కామెడీ హర్రర్ హంగులతో ఆకట్టుకునే విజువల్స్ తో రూపొందిన ఈ ట్రైలర్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

విషయం ఏమిటంటే, తాజాగా ఈ ట్రైలర్ పై తాజాగా బాలయ్య తో NBK 109 మూవీ తీస్తోన్న యంగ్ డైరెక్టర్ బాబీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. గీతాంజలి మళ్ళీ వచ్చింది ట్రైలర్ ఫన్ థ్రిల్లర్ లాగా ఉంది, కోనవెంకట్ గారు మరియు మొత్తం టీమ్ కి బెస్ట్ విషెస్, ఏప్రిల్ 11న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ యొక్క గ్రాండ్ రిలీజ్ కోసం తాను కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ చేసారు బాబీ. ఇక ఈ సినిమాలో శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, అలీ, రవి శంకర్ పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా అంజలికి 50వ సినిమా కావడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు