బాలయ్య ఫాలోవర్ గా యంగ్ హీరో ?

బాలయ్య ఫాలోవర్ గా యంగ్ హీరో ?

Published on Apr 3, 2021 9:45 PM IST

బోయపాటి శ్రీను – బాలయ్య బాబు సినిమాలో మరో హీరో మంచు మనోజ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ ప్రకారం ఈ సినిమాలో మంచు మనోజ్ క్యారెక్టర్ ఇంటర్వెల్ లో వస్తోందని.. బాలయ్య పాత్రను ఫాలో అయ్యే ఫాలోవర్ గా మనోజ్ పాత్ర ఈ సినిమాలో ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా సంగీత దర్శకుడు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

ఇక బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బాలయ్య కూడా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. ఈ సినిమా టైటిల్ పై మాత్రం ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి.

అందులో ప్రధానంగా ‘మోనార్క్‌’ అనే టైటిల్‌ బాగా వినిపించింది. ఆ తరువాత ‘గాడ్ ఫాదర్’ అనే మరో టైటిల్ కూడా బాగా వినిపించింది. అయితే కథకు ఈ రెండు టైటిల్స్ పర్ఫెక్ట్ గా సరిపోతాయట. బోయపాటి మాత్రం గాడ్ ఫాదర్ అనే టైటిల్ పై ఇంట్రస్ట్ గా ఉన్నాడట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు