రామ్ హీరోగా త్రినాద్ రావ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమా ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మెగా ఆకాష్ మరో కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.
మార్చి 12 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానున్న ఈ సినిమాకు దేవి శ్రీ సంగీతం అందిస్తుండగా విజయ్ కె చక్రవర్తి సినిమాటోగ్రఫర్ గా పనిచేస్తున్నాడు. ప్రకాష్ రాజ్ ఈ మూవీ లో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఫ్యామిలి లవ్ స్టోరీగా రూపొందనున్న ఈ మూవీకి సంభందించిన మరిన్ని విషయాలు త్వరలో మీడియాతో పంచుకోనున్నారు నిర్మాత దిల్ రాజు.
