సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్న యంగ్ హీరో !

Published on Jun 1, 2020 9:00 am IST

సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా సినీ అరంగేట్రం చేసిన మహేష్ బాబు టాలీవుడ్ టాప్ స్టార్ లలో ఒకరిగా ఎదిగారు. కాగా మహేష్ ఫ్యామిలీ నుండి జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడు అశోక్ గ‌ల్లా హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగతి తెలిసిందే. భ‌లే మంచి రోజు, శ‌మంత‌క మ‌ణి, దేవ‌దాస్ చిత్రాల‌తో పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న యువ ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.

కాగా ఈ సినిమాకి జీబ్రాన్‌ స్వరాలందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి నిన్న రాత్రి ఓ వీడియో గీతాన్ని రిలీజ్ ల చేసింది టీమ్. ఇది ‘యమలీల’ సినిమాలో కృష్ణ ఆడిపాడిన ‘జుంబారే.. జుజుంబరే’ పాటకి రీమిక్స్‌. ‘‘ ఈ పాటలో తన తాతయ్య కృష్ణను అశోక్‌ గల్లా అనుకరించిన విధానం ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. కాస్ట్యూమ్స్‌, సెట్స్‌ పాటకు సరిగ్గా సరిపోయాయి. నిధి గ్లామర్ ఈ పాటకి మరో ప్రత్యేక ఆకర్షణ. అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More