ఆ యంగ్ హీరో షూటింగ్ మళ్లీ మొదలెట్టేశాడు

ఆ యంగ్ హీరో షూటింగ్ మళ్లీ మొదలెట్టేశాడు

Published on Jul 4, 2019 11:32 AM IST

యంగ్ హీరో నాగ శౌర్య మళ్ళీ షూటింగ్ మొదలెట్టేశారు. గత నెల తన సొంత నిర్మాణ సంస్థ అయిన ఐరా క్రియేషన్స్ నిర్మిస్తున్న ఓ చిత్రం షూటింగ్ లో భాగంగా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో ఎటువంటి ఆధారం లేకుండా, డూప్ సహాయం తీసుకోకుండా 15అడుగుల ఎతైన భవనం పై నుండి దూకడంతో ఆయన మోకాలికి బలమైన గాయమైది. దీనితో వైద్యుల సలహా మేరకు గత 20 రోజులుగా ఆయన విశ్రాంతి తీసుకోవడం జరిగింది.

ప్రస్తుతం ఆయన గాయం నుండి కోలుకోవడంతో తిరిగి మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.దానికి సంబందించి ఫోటోలను సామాజిక మాధ్యమాలలో పంచుకోవడం జరిగింది. కాగా సమంత ప్రధాన పాత్రలో నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన “ఓ బేబీ” రేపు విడుదల కానుంది. అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ముగ్గురు హీరోయిన్స్, ముగ్గురు దర్శకులతో నిర్మించనున్న ప్రయోగాత్మక చిత్రంలో కూడా హీరోగా నాగ శౌర్య ఎంపికైనట్లు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు