తమిళ సినిమాని రీమేక్ చేసే ఆలోచనలో యంగ్ హీరో !
Published on Mar 13, 2018 8:57 am IST

యంగ్ హీరో సుందీప్ కిషన్ ఒకవైపు తెలుగు సినిమాలు చేస్తూనే మరోవైపు తమిళ పరిశ్రమలో కూడ ఉనికిని చాటుకుంటున్నారు. ప్రస్తుతం కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ‘నరగసూరన్’ అనే సినిమాలో నటిస్తున్న ఈయన తమిళ చిత్రం ‘ఇండ్రు నెట్రు నాలై’ ను తెలుగులోకి రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట.

సైన్స్ ఫిక్షన్ కామెడీ జానర్లో ఉండే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని ఈ రీమేక్ ను చేయాలని భావిస్తున్నారట సందీప్. అన్నీ కుదిరితే ఈ రీమేక్ ను నూతన దర్శకుడు శ్రీరామ్ డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయి. అయితే టీ టౌన్లో వినిపిస్తున్న ఈ వార్తల పట్ల సదరు హీరో నుండి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం బయటకురాలేదు.

 
Like us on Facebook