గోపీచంద్‌ ‘సిటీమార్’లో యంగ్ హీరో ?

Published on Sep 21, 2020 7:16 pm IST


గోపీచంద్‌ చేస్తోన్న తాజా సినిమా ‘సిటీమార్’. సంపత్‌ నంది డైరెక్షన్ లో రాబోతున్న ఈ స్పోర్ట్స్‌ బేస్డ్‌ మూవీలో మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మరో కీలక పాత్ర కూడా ఉందట. ఆ పాత్రలో యంగ్ హీరో ప్రిన్స్ ను తీసుకున్నారని.. కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రలో ప్రిన్స్ రఫ్ లుక్ లో కనిపిస్తాడని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో కామెడీ కోసం కోచ్ అసిస్టెంట్ పాత్రను చాలా వైవిధ్యంగా మలిచారని తెలుస్తోంది. ఆ పాత్రలో సునీల్ నటిస్తున్నాడట. చాల కాలం తరువాత సునీల్ కి మంచి కామెడీ క్యారెక్టర్ దొరికిందట. అన్నట్టు ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుండగా.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా నటిస్తోంది. వీరిద్దరి మధ్య నడిచే ట్రాక్ వెరీ ఇంట్రస్ట్ గా ఉంటుందట.

అయితే గోపీచంద్ ఎన్నో ఆశలతో సంపత్ నంది దర్శకత్వంలో చేసిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి సూపర్ హిట్ ఇవ్వాలనే కసితో బాగా పట్టుదలగా ఉన్నాడు సంపత్ నంది. మరి ఈ సారి ఈ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :

More