మంచు లక్ష్మీ టాక్ షోలో చొక్కా విప్పేసి షాకిచ్చిన యంగ్ హీరో

మంచు లక్ష్మీ టాక్ షోలో చొక్కా విప్పేసి షాకిచ్చిన యంగ్ హీరో

Published on Oct 14, 2019 9:05 AM IST

యాక్టర్ కమ్ హోస్ట్ అయిన లక్ష్మీ మంచు నిర్వహిస్తున్న తాజా టాక్ షో ఫీట్ అప్ విత్ ది స్టార్స్. డిజిటల్ ఫ్లాట్ ఫారం అయిన వూట్ నందు ప్రసారం ఐయ్యే ఈ షో నందు స్టార్స్ పాల్గొనడం ఒక విశేషము ఐతే వారి వారి వ్యక్తిగత విషయాలను సైతం పంచుకోవడం మరో విశేషం. సమంత, కాజల్, రకుల్, వరుణ్ తేజ్ వంటి స్టార్స్ ఇప్పటికే ఈ షో నందు పాల్గొనడం జరిగింది.కొంచెం మసాలా దట్టించి ఎంటర్టైనింగ్ గా సాగే ఈ షో ఇప్పటికే మంచి ఆదరణ దక్కించుకుంది.

కాగా యంగ్ హీరో నిఖిల్ ఈషోలో పాల్గొన్నారు. ఐతే వంటి మీద ఏమైనా ఉంటే నాకు నచ్చదంటూ నిఖిల్ చొక్కా విప్పేసి హోస్ట్ లక్ష్మీ కి షాక్ ఇచ్చారు. ఎవరినైనా ప్రేమించరా అన్న ప్రశ్నకు, ఒకరిని ఇష్టపడుతున్నానన్న నిఖిల్ లావణ్య త్రిపాఠి పై హాట్ కామెంట్ చేశారు. నేటి ఎపిసోడ్ లో కార్యక్రమం ప్రసారం కానుంది. కాగా నిఖిల్ నటించిన అర్జున్ సురవరం మూవీ విడుదల వాయిదా పడుతూ వస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు