గ్లామర్ రోల్స్ కి రెడీ అంటున్న యంగ్ హీరోయిన్ !

గ్లామర్ రోల్స్ కి రెడీ అంటున్న యంగ్ హీరోయిన్ !

Published on Oct 16, 2019 7:08 PM IST

Avika

యంగ్ హీరోయిన్ అవికా గోర్ హిందీ టెలివిజన్ లో తన కెరీర్‌ ను మొదలెట్టినా… తెలుగు సినిమాతోనే హీరోయిన్ గా పరిచయం అయింది. కాగా తాజగా ‘రాజాగారు గది’ ప్రాంచైజీలో వస్తున్న మూడవ చిత్రం ‘రాజుగారి గది 3’లో అవికా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ రోజు మీడియాతో మాట్లాడిన అవికా.. తన కెరీర్ కి సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ చెప్పింది. ఇక నుండి గ్లామర్ రోల్స్ చేయడానికి తానూ రెడీగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది.

కాగా హారర్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 18న విడుదల కానుంది. అశ్విన్ బాబు హీరోగా నటించగా, ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో తక్కువ హర్రర్ ఎక్కువ కామెడీ ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో బ్రహ్మజీ, ఊర్వశి, ధన్రాజ్, అజయ్ ఘోష్, అలీ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. ఓక్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి షబీర్ స్వరాలు అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు