
గత మూడు నాలుగు వారాలుగా చిన్న యంగ్ హీరోల సినిమాలన్నీ టాలీవుడ్ బాక్స్ ఆఫీసు వద్ద కంటిన్యూగా సందడి చేస్తున్నాయి. ప్రతి వారం మినిమమ్ 2 లేదా 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఎప్పటిలానే ఈ వారం కూడా నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నయి. ఆ విషయాన్ని కాసేపు పక్కనపెడితే.. జూన్ 26వ తేదీకి నాలుగు సినిమాలు ఫైనలైజ్ అయ్యాయి.
అవే అనుష్క – గుణశేఖర్ ల పీరియడ్ ఫిల్మ్ ‘రుద్రమదేవి’, అల్లరి నరేష్ కామెడీ ఎంటర్టైనర్ ‘జేమ్స్ బాండ్’, సందీప్ కిషన్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘టైగర్’ మరియు నాగ శౌర్య యాక్షన్ ఎంటర్టైనర్ ‘జాదూగాడు’. ఈ యంగ్ హీరోస్ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసినా రుద్రమదేవి లాంటి సినిమాతో కలిసి రావడం కాస్త రిస్క్ అనే చెప్పాలి. కానీ వారికి తీపి కబురు లాంటి వార్త కొద్ది సేపటి క్రితమే వెలువడింది. అదే రుద్రమదేవి సినిమా రిలీజ్ జూన్ 26 నుంచి తప్పుకోవడం. దీంతో మన యంగ్ హీరోస్ కి కాస్త ఊరట లబించడమే కాకుండా, థియేటర్స్ విషయంలో వారి సినిమాలకి లైన్ క్లియర్ అయ్యింది.
మరి ఈ ముగ్గురు హీరోలలో జూన్ 26న ఎవరు ఎక్కువగా తెలుగు ప్రేక్షకులను మెప్పించి బాక్స్ ఆఫీసు కలెక్షన్స్ కొల్లగొడతారనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..

