యంగ్ మెగా హీరో ఫుల్ లుక్ తో వచ్చేశాడు !

యంగ్ మెగా హీరో ఫుల్ లుక్ తో వచ్చేశాడు !

Published on Feb 14, 2020 5:35 PM IST

మెగా మేనల్లుడు వైష్ణ‌వ్‌ తేజ్ ‘ఉప్పెన’ అనే చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవ్వబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా నుండి వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఈ రోజు హీరో వైష్ణ‌వ్‌ తేజ్ ఫుల్ లుక్ ను రివీల్ చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్ లో వైష్ణ‌వ్‌ తేజ్ మత్స్యకారుడిగా కనిపిస్తూ తన లుక్ తో ఆకట్టుకున్నాడు. అలాగే హీరోయిన్ లుక్ ను కూడా రివీల్ చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. మొత్తానికి ఈ పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని పెంచాయి. ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదల కానుంది.

ఇక వైష్ణ‌వ్‌ తేజ్ తో పాటు నూతన దర్శకుడు బుచ్చిబాబు సానాను దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అయితే విలక్షణ నటుడిగా విజయ్ సేతుపతి ఈ మూవీలో హీరోయిన్ కి తండ్రిగా అలాగే విలన్ పాత్రలో కనిపించనున్నాడట.

‘రాక్ స్టార్’ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించనున్నారు. అలాగే ‘రంగస్థలం’ ఫేమ్ రామకృష్ణ మౌనిక ఆర్ట్ డిపార్ట్ మెంట్ ను చూసుకుంటుండగా… నవీన్ నూలి ఎడిటర్ గా చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు