‘భారతీయుడు 2’ మరో యంగ్ స్టార్ !

‘భారతీయుడు 2’ మరో యంగ్ స్టార్ !

Published on Nov 14, 2018 10:24 AM IST

కమల్‌ హాసన్‌, స్టార్‌ డైరెక్టర్ శంకర్‌ ల కలయికలో 1996లో వచ్చిన భారతీయుడు చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం దర్శకుడు శంకర్‌ భారతీయుడు సీక్వెల్‌ ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

కాగా ఈ చిత్రంలో ఇప్పటికే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఒక కీలక పాత్రలో నటించనున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ప్రముఖ యువ తమిళ నటుడు శింబు కూడా భారతీయుడు 2లో ఓ కీలక పాత్ర పోషించనున్నాడని తెలుస్తోంది.

శింబు ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడట. అయితే చిత్రబృందం నుండి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్ముస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు