
ఫిల్మ్ ఇండస్ట్రీలో సన్నిహితులకు, తన స్నేహితులకు పార్టీ ఇచ్చారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొడుకు పుట్టిన ఆనందాన్ని తన ఆప్తమిత్రులతో పంచుకున్నారు. మంగళవారం సాయంత్రం తర్వాత ఈ పార్టీ జరిగింది. ఈ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
పార్టీ జరిగినంత సేపు ఎన్టీఆర్ చాలా సంతోషంగా కనిపించారు. పాటలు పాడుతూ.. డాన్సు చేస్తూ.. ఆప్తులతో అనందంగా గడిపారు. తారక్ ఈజ్ అమేజింగ్, మోస్ట్ లవింగ్ & కేరింగ్ అంటూ ప్రముఖ రచయిత కోన వెంకట్ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం ‘రభస’ ఆడియో ఆగస్ట్ 1న విడుదల అవుతుంది. నేటితో సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుంది. సినిమా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.