నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం ‘ఎంత మంచివాడవురా’. సతీశ్ వేగేశ్న ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను జనవరి 8న జరగనుంది. కాగా సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచటానికి ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ ను తీసుకువస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ముఖ్య అథితిగా రాబోతున్నాడు అని చిత్రబృందం పోస్టర్ ను రిలీజ్ చేసిన వెంటనే.. ఈ సినిమా ట్రెండింగ్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. అప్పటివరకూ ట్రెండ్ లో లేని ఈ సినిమా టైటిల్.. ఎన్టీఆర్ అతిధిగా రాబోతున్నాడు అనే సరికి ట్రెండ్ అవ్వడం విశేషం.
ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించడం జరిగింది. ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్తలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయకిగా నటించింది. జనవరి 15వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘118’ చిత్రంతో హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ‘ఎంతమంచి వాడవురా’తో ఆ విజయాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు.


