చిరు, పవన్‌లకు ఆహ్వానం అందింది !

Published on May 29, 2019 7:35 pm IST

రేపు 30వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తన సన్నిహితులు, రాష్ట్ర, జాతీయ రాజకీయ నాయకులతో పాటు ఇతర రంగాల ప్రముఖుల్నీ ఆహ్వానించిన జగన్ మెగాస్టార్ చిరంజీవికి కూడా నేరుగా ఫోన్ చేసి వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించారట.

అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు సైతం స్వయంగా ఫోన్ చేసి ప్రమాణస్వీకారానికి ఆహ్వానం పలికారట. అంటే రేపు మెగా బ్రదర్స్ ఇద్దరూ కలిసి జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యే అవకాశాలున్నాయన్నమాట. రేపు మధ్యాహ్నం 12.23 గంటల శుభ ముహూర్తానికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జగన్ నూతన ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టనున్నారు.

సంబంధిత సమాచారం :

More