వై ఎస్ జగన్ చేతులమీదుగా విడుదలకానున్న టీజర్ !

My Dear Marthanada1

రైజింగ్ కమెడియన్ గా పేరొందిన 30ఇయర్స్ పృథ్వి హీరోగా నూతన దర్శకుడు కే వి హరీష్ తెరకెక్కిస్తున్న చిత్రం’మై డియర్ మార్తాండం’. 30 రోజుల్లో లాయర్ అయ్యి కోర్టులో కేసులను ఎలగెలిపించాడనే కథ తో తెరకెక్కుతుంది ఈచిత్రం . లాయర్ గెటప్ లో పృథి తన కామెడీ తో అలరించనున్నాడు. ఇక ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ లభించింది.

ఇక ఈ చిత్రం యొక్క టీజర్ ను లాంచ్ చేయనున్నారు ‘వైఎస్ఆర్ సిపి’ పార్టీ అధినేత ఆంధ్రప్రేదేశ్ ప్రతిపక్ష నాయకుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి. పృథ్వి కి జగన్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. ఇటీవల ఆయన జగన్ పార్టీ కి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే అంతేకాకుండా జగన్ చేపడుతున్న పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. ఆచనువుతోనే టీజర్ను ఆయన చేతులమీదుగా విడుదలచేయిస్తున్నారని సమాచారం. పవన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మజిన్ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రం ఆగష్టు లో ప్రేక్షకులముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version