డైరెక్షన్ కోసం స్క్రిప్ట్ రెడీ చేసుకున్న యంగ్ హీరో !

డైరెక్షన్ కోసం స్క్రిప్ట్ రెడీ చేసుకున్న యంగ్ హీరో !

Published on Nov 8, 2018 4:00 AM IST

మొదట నటులుగా ఎంట్రీ ఇచ్చి .. ఆ తరువాత దర్శకులుగా మరి సక్సెస్ ఫుల్ చిత్రాలు తీసిన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ ప్రస్తుతం చాలామందే ఉన్నారు. అవసరాల శ్రీనివాస్‌, అడివి శేష్, వెన్నెల కిశోర్‌, పోసాని కృష్ణమురళి ఇటీవలే రాహుల్ రవీంద్రన్‌ ఇలా చాలామందే ఉన్నారు. ఈ లిస్ట్‌లోకి మరో యంగ్ హీరో విశ్వక్‌సేన్‌ కూడా రాబోతున్న విషయం తెలిసిందే.తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది..? చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్‌సేన్‌.

కాగా విశ్వక్‌సేన్‌ త్వరగా డైరెక్టర్ గా మారేందుకు.. స్క్రిప్ట్ రెడీ అయింది. ‘అంగమలై డైరీస్‌’ అనే మలయాళ చిత్రాన్ని తెలుగలోకి రీమేక్‌ చేస్తున్నాడు. ఆ స్క్రిప్ట్ కు సంబంధించే మార్పులు చేర్పులనే విశ్వక్‌సేన్‌ పూర్తి చేశారట. సాధ్యమైనంత త్వరగా తన డైరెక్షన్ లో సినిమా స్టార్ట్ చెయ్యాలని విశ్వక్‌సేన్‌ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వక్‌సేన్‌ కు గతంలో షార్ట్‌ ఫిలింస్‌ ను తీసిన అనుభవం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు