సంగీత ప్రపంచంలో ఎన్నో అద్భుతగీతాలను అందించిన మాస్ట్రో ఇళయరాజాకి వారసుడిగా చినీఎ ఇండస్ట్రీకి వచ్చిన మరో మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా. ఇప్పటి వరకూ 100కి పైగా సినిమాలకు మ్యూజిక్ అందించిన యువన్ శంకర్ రాజా తనకంటూ ఓ ప్రత్యెక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇటీవలే యువన్ శంకర్ రాజా ఇస్లాం మతంలోకి మార్పు అయ్యాడు. అలాగే యువన మూడవ సారి వివాహం చేసుకున్నాడు.
తాజగా యువన్ కిలకరై లో జాఫ్రూన్ అనే ముస్లీం యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహ మహోత్సవం చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకి యువన్ బంధుమిత్రులు హాజరయ్యారు. యువన్ శంకర్ రాజా తెలుగులో ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించాడు. యువన్ తెలుగులో చివరిగా రామ్ చరణ్ నటించిన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాకి మ్యూజిక్ అందించాడు.


