డిసెంబర్లో యువన్ శంకర్ రాజా మూడో పెళ్లి..?

yuvan-shankar-raja
ఇటివలే ఇస్లాం మతం స్వీకరించిన యువ సంగీత దర్శకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా త్వరలో మూడో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారని సమాచారం. ఈ అక్టోబర్ 28 జప్ఫ్రున్నిసా అనే అమ్మాయితో యువన్ శంకర్ రాజా ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. డిసెంబ‌ర్‌ లో పెళ్లి ఉంటుంద‌ని చెన్నై మీడియా టాక్.

2005లో మార్చి 21న తన చిరకాల స్నేహితురాలు, సింగర్ అయినటువంటి సుజయ చంద్రన్‌ ను యువన్ వివాహం చేసుకున్నారు. కొంతకాలం తర్వాత ఇద్దరూ పరస్సర అంగీకారంతో విడిపోయారు. 2008లో కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. 2011లో సెప్టెంబర్ 1 న శిల్పా అనే అమ్మాయితో యువన్ రెండో వివాహం జరిగింది. ఏమైందో ఏమో కొన్ని రోజుల తర్వాత శిల్పతో కూడా విడిపోయారు. చాలా రోజుల నుండి యువన్ ఒంటరిగానే ఉంటున్నారు.

Exit mobile version