శ్రద్ధాదాస్ మరో జ్యోతిలక్ష్మి అన్న వై.వి.ఎస్ చౌదరి

శ్రద్ధాదాస్ మరో జ్యోతిలక్ష్మి అన్న వై.వి.ఎస్ చౌదరి

Published on Feb 14, 2013 4:10 PM IST

YVS-and-Shraddha-Das
తన సినిమాల్లో కథానాయికలకి వై.వి.ఎస్ చౌదరి హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.ఆరంభం నుండే అగ్రనటులతో పనిచేసిన ఆయన చేసిన ‘దేవదాసు’ తో ఇలియానాని పరిచయం చేసి,ఆ తార తారాస్థాయికి చేరుకోవడంలో తోడ్పడ్డాడు. ప్రస్తుతం సాయి ధరంతేజ్ నటిస్తున్న ‘రేయ్’ చిత్రం పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు.ఇందులో సైయామి ఖేర్ మరియు శ్రద్ధాదాస్ కథానాయికలు.

కొన్నిరోజుల క్రితం సైయామి ఖేర్ భవిష్యత్తులో పెద్ద హీరొయిన్ అవుతుంది అన్న ఆయన ఇప్పుడు శ్రద్ధాదాస్ ని కొంచెం కొత్తగా పొగుడుతున్నాడు.”నేను ఆరోజుల్లో జ్యోతిలక్ష్మికి ,సిల్క్ స్మితకి వీరాభిమానిని, వాళ్ళ సినిమాలలో వాళ్ళు ఎప్పుడొస్తారా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచుసేవాడిని. చాలా రోజుల తరువాత నాకు జ్యోతిలక్ష్మిలోని లక్షణాలు శ్రద్ధాదాస్ లో కనిపించాయి. తను ‘రేయ్’ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇందులో తన పాత్ర పేరు జెన్నీ, ఎటువంటి పోటీనీ సహించలేని ఒక అమెరికన్ పాప్ స్టార్ గా చాలా హాట్ గా కనపడనుంది” అని పేర్కొన్నాడు.

‘రేయ్’ చిత్ర చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. వై.వి.ఎస్ చౌదరి తన సొంత సంస్థలో నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. రేయ్ చిత్రం ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు