విశ్వక్సేన్ ‘గామి’ ని వినూత్నంగా గా ప్రమోట్ చేస్తున్న జీ 5

విశ్వక్సేన్ ‘గామి’ ని వినూత్నంగా గా ప్రమోట్ చేస్తున్న జీ 5

Published on Apr 12, 2024 10:00 PM IST

యువ నటుడు విశ్వక్సేన్ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్ గా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ మూవీ గామి. ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన గామి పర్వాలేదనిపించే విజయం మాత్రమే అందుకుంది. ఇక తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం జీ 5 ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చింది. కాగా మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ కోసం జీ 5 వారు వినూత్నంగా ఒక స్ట్రాటజీ ద్వారా ప్రమోట్ చేసారు.

హిమాలయాల్లోని మంచు ప్రదేశాల్లో ఈ మూవీ చిత్రీకరించబడడంతో వాటిని ప్రతిబింబించేలా చిన్న మంచు పర్వతాలను క్రియేట్ చేసారు. ఇక తమ మూవీ ఓటిటి ప్రమోషన్స్ లో పాల్గొన్న హీరో విశ్వక్, డైరెక్టర్ విద్యాధర్ ఇద్దరూ మాట్లాడుతూ, ఈ విధంగా గామి కోసం జీ 5 వారు ప్రమోట్ చేస్తున్న విధానం ఎంతో బాగుందని, థియేటర్స్ లో ఆకట్టుకున్న ఈ మూవీ ఆడియన్స్ ని ఓటిటి లో మరింతగా అలరిస్తుందని అభిప్రాయపడ్డారు. హీరో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించిన ఈ మూవీలో అభినయ, హారిక పెద్ద, మొహమ్మద్ సమద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు