సమీక్ష : ఏంజెల్ – అక్కడక్కడా మెప్పించింది

సమీక్ష : ఏంజెల్ – అక్కడక్కడా మెప్పించింది

Published on Nov 4, 2017 7:02 AM IST
Angel movie review

విడుదల తేదీ : నవంబర్ 3, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : ‘బాహుబలి’ పళని

నిర్మాత : యోగీశ్వర్‌రెడ్డి

సంగీతం : భీమ్స్ సిసిరోలియో

నటీనటులు : నాగ అన్వేష్, హెబ్బా పటేల్, సప్తగిరి

కథ:

అమరావతి తవ్వకాల్లో ఒక అరుదైన విగ్రహం దొరుకుతుంది, ఆ విగ్రహాన్ని జాగ్రత్తగా మరో చోటికి చేర్చమని నాని (నాగ అన్వేష్) గిరి (సప్తగిరి) లకు పిలుపు వస్తుంది. వారు ఆ పనిలో ఉండగా నక్షత్ర (హెబ్బా పటేల్) నానికి పరిచయం అవుతుంది. నక్షత్ర ఒక గంధర్వ కన్య. దివిలో నివసించే ఆమె భూలోకమునకు వచ్చి ఉండేందుకు ఇష్టపడుతుంది. ఆమె భూలోకమునకు వచ్చాక ఏం జరిగింది ? నానితో ఎలా ప్రేమలో పడింది ? నాని, నక్షత్ర పెళ్లి చేసుకున్నారా ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో నాగ అన్వేష్ నటన పరంగా బాగానే చేశాడు. మొదటి సినిమాకి, ఈ సినిమాకు పరిణితి చూపించాడు. మాస్ యాంగిల్ లో బెటర్ గానే ఎక్స్పోజ్ అయ్యాడు. హీరో స్నేహితుడిగా సప్తగిరి చేసిన కామెడి అక్కడక్కడా నవ్వించింది. సెకండాఫ్లోని ప్రీ క్లైమాక్స్ లో వచ్చే కొద్దిపాటి కామెడీ ట్రాక్ వర్కవుట్ అయింది. హెబ్బా పటేల్ కూడా తన పాత్రలో బాగానే నటించింది. లుక్స్ పరంగా కూడా అందంగా కనబడుతూ ఆకట్టుకుంది.

కబీర్, ప్రదీప్ రావత్, షియాజీ షిండే వారి పరిధి మేరకు నటించారు. మేకింగ్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. ఒక గంధర్వ కన్య భూమి మీదకు రావడం, వేరొకరికి మంచి చేయాలని అనుకోవడం, ఆ ప్రాసెస్లో ప్రేమలో పడటం వంటి అంశాలు కథ పరంగా బాగానే ఉన్నాయి.

మైనస్ పాయింట్స్:

హీరోయిన్ పాత్ర కొద్దిగా బలహీనంగా ఉంది. గంధర్వ కన్య ఆయిన ఆమే భూమి మీదకు రావడాలనుకోవడం బాగానే ఉన్నా దానికంటూ బలమైన కారణం అనేది లేకపోవడంతో కథలో పట్టు తప్పింది. దీనికి తోడు ఆ తర్వాతి సన్నివేశాలు కూడా పేలవంగా ఉండటంతో ఆ లోటు మరింత ఎక్కువగా కనబడింది. కానీసం హీరో హీరోయిన్ల మధ్యన లవ్ ట్రాక్ అయినా బలంగా ఉండి రొమాన్స్ పండి ఉంటే బాగుండేది.

సప్తగిరి కామెడి కొన్ని సందర్భాల్లో నవ్వించినా కొన్ని సన్నివేశాలలోచికాకు పెట్టింది. కథ సరిగా లేకపోవడానికి తోడు కథకు అవసరంలేని సీన్స్ ఉండటం మరొక ఇబ్బందిగా తోచింది. సోషియో ఫాంటసీ కథకు కథనం చాలా కన్విన్సింగా, వినోదాత్మకంగా ఉండాలి కానీ ఇందులో కథనం సరిగా లేకపోవడంతో ఫలితం కూడా తారుమారురైంది. ఇక ప్రీ క్లైమాక్స్ కూడా కన్విన్సింగా లేదు. ప్రతి నాయకుడ్ని కాసేపు సీరియస్ గా ఇంకాసేపు కామెడీగా చూపించే సరికి కథనంలో బలం తగ్గిపోయింది. పాటలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.

సాంకేతిక విభాగం:

డైరెక్టర్ పళని ఎంచుకున్న కథ పాతదే అయినా కథనం సరిగా రాసుకుంటే హిట్ ఫార్ములానే కానీ ఇక్కడ ఆ కథనమే లో క్వాలిటీలో ఉండి దెబ్బతీసింది. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు గొప్పగా లేవు. నేపధ్య సంగీతం అక్కడక్కడ బాగుంది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు. గంధర్వ లోకంలో సన్నివేశాలు బాగా చిత్రికరించారు సినిమాటోగ్రఫర్. ఎత్నిక్ క్రియేటివ్ స్టూడియోస్ వారి సీజీ వర్క్ బాగుంది. క్లైమాక్స్ ఫైట్ ను ఆసక్తికరంగా డిజైన్ చేశారు. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

తీర్పు:

హీరో నాగ అన్వేష్ చేసిన ఈ రెండవ ప్రయత్నంలో నటుడిగా మంచి మార్కులే పొందాడు. దర్శకుడు బాహుబలి పళని ఆసక్తికరమైన సోషియో ఫాంటసీ కథనే ఎంచుకున్నా దానికి సరైన కథనాన్ని, ఆకట్టుకునే సన్నివేశాలని, కామెడీ ట్రాక్ ను సరైన టైమింగ్ లో వాడుకోలేకపోవడం వలన ఫలితం గొప్ప స్థాయిలో రాలేదు. హీరో, హీరోయిన్ల నటన, సప్తగిరి కామెడీ ట్రాక్, సినిమా క్లైమాక్స్, కొంత సీజీ వర్క్ ఆకట్టుకునే అంశాలు కాగా పేలవమైన కథనం, టేకింగ్ ఎఫెక్టివ్ గా లేకపోవడం నిరాశపరిచే అంశాలు. మొత్తం మీద ఈ ‘ఏంజెల్’ చిత్రం అక్కడక్కడా మాత్రమే మెప్పించి హల చోట్ల నిరుత్సాహపరిచేదిగా ఉందని చెప్పొచ్చు.
123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు