ఆడియో సమీక్ష : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు – మెలోడియస్ ట్రీట్

ఆడియో సమీక్ష : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు – మెలోడియస్ ట్రీట్

Published on Dec 18, 2012 8:30 AM IST

SVSC
టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం నిన్నటి సాయం సంధ్యా సమయలో సాంప్రదాయబద్దంగా జరిగింది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోలోని కొన్ని పాటలు ఇప్పటికే సినీ ప్రేమికులను తెగ ఆకట్టుకున్నాయి. విక్టరీ వెంకటేష్ – సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా నటించిన ఈ సినిమాలో వీరిద్దరికీ పాటలను కూడా సమానంగా విభజించారు. ఈ ఆల్బం పై ఉన్న అంచనాలను అందుకుందా?లేదా? ఇంతకీ ఆడియో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

1) పాట : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
గాయని : చిత్ర, కోరస్
రచయిత : అనంత్ శ్రీరామ్

svsc-audio2ఈ పాటని కంపోజ్ చేసిన మిక్కీ జే మేయర్, పాట రాసిన అనంత్ శ్రీరామ్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి. వారిద్దరూ కలిసి ఒక అధ్బుతమైన అచ్చ తెలుగు పాట మనకు ఇచ్చారు. క్లాసిక్ సింగర్ చిత్ర పాటకి ప్రాణం పోసింది. పాట మొదట్లో వచ్చే బిట్ కూడా చాలా బావుంది. చాలా రోజుల తరువాత ఒక అచ్చ తెలుగు పెళ్లి పాట వింటున్న ఫీలింగ్ కలుగుతుంది. మన తెలుగు పెళ్లి సంప్రదాయాలను చెబుతూ వచ్చే పాట. ఇది ఖచ్చితంగా మిక్కీ జే మేయర్ కెరీర్ బెస్ట్ సాంగ్ అని చెప్పుకోవచ్చు.

2) పాట : ఏం చేద్దాం
గాయకులు : రంజిత్, శ్రీరామచంద్ర, కార్తీక్
రచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి

svscccఇద్దరు హీరోలకు కలిపి వచ్చే ఇంట్రడక్షణ్ సాంగ్ ఇది. కార్తీక్ వాయిస్ తో స్టార్ట్ అయి ఫాస్ట్ బీట్ తో వెళ్తుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి తన సాహిత్యానికి మరింత పదును పెట్టారు. మరోసారి ప్రశ్నలను సంధించారు. రంజిత్, కార్తీక్, శ్రీరామచంద్ర గాత్రంలో ఎనర్జీ లెవెల్స్ బావున్నాయి. మిక్కీ జే మేయర్ ఈ తరహా పాటల్ని గతంలో చాలా సార్లు ఇచ్చాడు.

3) పాట : ఆరడుగులుంటాడా
గాయని : కల్యాణి
రచయిత : అనంత్ శ్రీరామ్

ssssssఆడియో విడుదలకు ముందు నుండే ఈ పాట బైట వినిపిస్తుంది. ఈ ఆల్బంలో మరో అదిరిపోయే పాట ఇది. హీరొయిన్ సమంత తన ప్రియుడు గురించి పాడుకునే యుగాల గీతం. గాయని కళ్యాణి కూడా చాలా బాగా పాడింది ఈ పాటని. ఫ్రెష్ ఫీల్ ఉంది ఆమె గాత్రంలో. అనంత్ శ్రీరామ్ సాహిత్యం కూడా బావుంది. సాంగ్ ప్రోమో చూస్తే సమంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ యువకులని గిలిగింతలు పెడతాయి.

4) పాట : ఇంకా చెప్పాలే
గాయనీ గాయకులు : రాహుల్ నంబియార్, శ్వేతా పండిట్
రచయిత : అనంత్ శ్రీరామ్

svscaudio3మహేష్, సమంత మీద వచ్చే రొమాంటిక్ ప్రేమ గీతం ఇది. రాహుల్ నంబియార్, శ్వేతా పండిట్ ఇద్దరు బాగా పాడారు. అనంత్ శ్రీరామ్ సాహిత్యం పర్వాలేదు. చిత్రీకరణ బావుంటే మంచి రొమాంటిక్ పాట అవుతుంది.

5) పాట : మేఘాల్లో
గాయకుడు : శ్రీరామచంద్ర, కార్తీక్
రచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి

dedeసీతారామ శాస్త్రి గారు రాసిన మరో పెళ్లి పాట. ఈ పాట వెంకటేష్, మహేష్ సోదరి పెళ్లి బ్యాక్ డ్రాప్లో వచ్చే పాట ఇది. కుటుంబ సభ్యులందరి మీద చూడముచ్చటగా ఉండేలా ఈ పాటని చిత్రీకరించారు కాబట్టి ఈ పాట ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. శ్రీరామచంద్ర, కార్తీక్ ఇద్దరూ గాత్రంతో పాటకి న్యాయం చేసారు. మిక్కీ సంగీతం సాహిత్యాన్ని డామినేట్ చేయకుండా సాగింది.

6) పాట : మరీ అంతగా
గాయకుడు : శ్రీరామచంద్ర
రచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి

rrrశ్రీరామచంద్ర పాడిన సోలో సాంగ్. అలిగిన ప్రియురాలిని సముదాయిస్తూ ప్రియుడు పాడే పాట. పాట వింటుంటే వెంకటేష్, అంజలి మీద చిత్రీకరించినట్లు అర్ధమవుతుంది. ‘ఎక్కిల్లే పెట్టి ఏడుస్తుంటే కస్గ్తం పోతుందా’ ట్యూన్ దగ్గర శ్రీరామచంద్ర గాత్ర మాధుర్యం చాలా బావుంది. సిరివెన్నెల సాహిత్యం గురించి కొత్తగా చెప్పేది ఏముంది.

7) పాట : వాన చినుకులు
గాయనీ గాయకులు : అంజన సౌమ్య, కార్తీక్
రచయిత : అనంత్ శ్రీరామ్

vvfvఈ ఆల్బంలో చివరి పాట ఇదే. ఆల్బంలో మాస్ పాట ఒక్కటి కూడా లేదనే లోటు ఈ పాటతో తీరిపోయింది. వెంకటేష్, అంజలి మధ్య వచ్చే వాన పాట ఇది. అంజన సౌమ్య గాత్రం మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుంది. అనంత్ శ్రీరామ్ సాహిత్యం పర్వాలేదు. ఈ పాట ఇంకా చిత్రీకరించాల్సి ఉంది. సంగీత వాయిద్యాలు పాటని డామినేట్ చేయకుండా ఉన్నాయి.

 

తీర్పు :

తెలుగు సినీ ప్రేమికులకు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఆడియో పెళ్లి భోజనం లాంటి మెలోడీ ట్రీట్. సినిమా థీంకి తగ్గట్టుగానే సాంగ్స్ చాలా ఫ్రెష్ గా వినసొంపుగా ఉన్నాయి. టైటిల్ సాంగ్ ‘సీతమ్మ వాకిట్లో’ మరియు సమంత ‘ఆరడుగులుంటాడా’ పాటలు అల్టిమేట్ గా ఉన్నాయి. అలాగే ‘ఇంకా చెప్పలే’, ‘మరీ అంతగా’ మరియు ‘వాన చినుకులు’ పాటలు కూడా బాగున్నాయి. మిక్కీ ఈ సినిమాకి అద్భుతమైన సంగీతం అందించడంలో నూటికి నూరు శాతం న్యాయం చేసాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు