సమీక్ష : ఛోటా భీమ్ అండ్ ది థ్రోన్ ఆఫ్ బాలి – చిన్న పిల్లలను ఆకట్టుకునే భీమ్..

సమీక్ష : ఛోటా భీమ్ అండ్ ది థ్రోన్ ఆఫ్ బాలి – చిన్న పిల్లలను ఆకట్టుకునే భీమ్..

Published on May 3, 2013 2:30 PM IST
Chota-Bheem విడుదల తేదీ : 03 మే 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకుడు : రాజీవ్ చిలక
నిర్మాత : రాజీవ్ చిలక, సమీర్ జైన్
సంగీతం : సునీల్ కౌషిక్
నటీనటులు : భీమ్, అర్జున్

గ్రీన్ గోల్డ్ పీచర్స్ వారి సమర్పణలో రాజీవ్ చిలక నిర్మించి దర్శకత్వం వహించిన యానిమేషన్ సినిమా ‘ఛోటా భీమ్ అండ్ ది థ్రోన్ ఆఫ్ బాలి’. గతంలో వచ్చిన ఛోటా భీమ్ సీరిస్ లకి ఇది 5వ పార్ట్. ఈ సినిమాకి సునీల్ కౌషిక్ సంగీతాన్ని అందించగా రొసౌరో బి. అడోరబల్ యానిమేషన్ డైరెక్టర్ గా పని చేశాడు. పూర్తి యానిమేషన్ తో నిర్మించిన ఈ సినిమాని చిన్న పిల్లల కోసం నిర్మించారు. చిన్న పిల్లలని ఎంతవరకూ ఆకట్టుకుందో, అసలు ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

డోలక్ పూర్ రాజ్యంలో భీమ్ అనే అబ్బాయి వుంటాడు. అతడు బుద్దిమంతుడు, బలమంతుడు, రాజభక్తి కలవాడు. ఆ రాజ్యంలో ఎవరు ఆపదలో ఉన్నా కాపాడుతూ ఉంటాడు. ఒక రోజు ఆ రాజ్యం రాజు తన కూతురు కథ చెప్పమనడంతో తన చెల్లెలి రాజ్యంలో రాక్షసి రంగడకి, దేవుడైన బారన్ కి మద్య జరిగిన నిజమైన కథని ఆమెకి చెప్పుతాడు. అంతే కాకుండా తన చెల్లెల కొడుకు అర్జున్ ప్రతిభ గురించి కూడా గొప్పగా చెబుతాడు. అర్జున్ పట్టాభిషేకం కోసం డోలక్ పూర్ రాజు తన కూతురుతో పాటు భీమ్ మరియు అతని బృందాన్ని కూడా తీసుకోని బాలికి బయలుదేరతాడు.

అదే సమయంలో కాలచక్రంలో బందీగా వున్న రంగడని ఓ మాంత్రికుడు బయటికి తీసుకొస్తాడు. అలా వచ్చిన రాక్షసి రంగడి బాలి రాజ్యాన్ని నాశనం చేయడమే కాక అర్జున్ తల్లి తండ్రులను బందిస్తుంది. అక్కడి నుంచి ఎలాగో తప్పించుకున్న అర్జున్ కి అదే టైములో అక్కడికి వచ్చిన డోలక్ పూర్ రాజు, చోటా భీమ్ అర్జున్ పరిస్థతి చూసి అతన్ని, రాజ్యాన్ని ఎలాగైనా ఆ రాక్షసి నుండి కాపాడాలనుకుంటాడు. ఈ లక్ష్యం కోసం ఛోటా భీమ్, అర్జున్ లు ఒకటై రాక్షసి అయిన రంగడని ఎలా హతమార్చారు? ఎలా తమ రాజ్యాన్ని కాపాడుకున్నారు అనేదే కథాంశం.

ప్లస్ పాయింట్స్ :

సినిమా కథ బాగుంది, సినిమాలో పాత్రలు చెప్పే డైలాగ్స్ పిల్లల్ని బాగానే నవ్విస్తాయి. ఈ సినిమాలో చూపించిన రాక్షస కోటలు, రాక్షసుల ఆకారాలు చిన్న పిల్లలని ఆకట్టుకునేలా వున్నాయి. సినిమాలో ఆయుధాలే మనుషులని ఎంచుకోవడం అనే కాన్సెప్ట్ బాగుంది. సినిమాలో పాటలను బాగా కామెడీగా చిత్రీకరించారు. ముఖ్యంగా ‘నేనే బలవంతుడిని’ అనే సాంగ్ ని బాగా తీసారు ఆ సాంగ్ తర్వాత అర్జున్ కి భీమ్ కి మధ్య జరిగిన పోటీలో భీమ్ గెలిచాడని అతని టీం ప్రస్తుతం ఐపిఎల్ లో బాగా వినిపిస్తున్న ‘జమిపింగ్ జపాన్’ మ్యూజిక్ కి డాన్స్ వెయ్యడం చాలా బాగుంది. రాక్షసి రంగడ లుక్ చిన్నపిల్లలకు నచ్చేలా ఉంది. సినిమా క్లైమాక్స్ 20నిమిషాలు పిల్లలు చాలా ఆసక్తికరంగా, ఎంజాయ్ చేసేలా తీసారు.

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్ చాలా వేగంగా సాగినా సెకండాఫ్ క్లైమాక్స్ వరకూ చాలా నిధానంగా సాగుతుంది. సినిమా మొదట్లో అర్జున్ పాత్రను చాలా హైలెట్ చేస్తారు కానీ సినిమా మొత్తం మీద చూసుకుంటే అతని పాత్ర అంత బాగుండదు. రాక్షలుల విషయంలో ఎప్పుడూ భీమ్ దే పై చేయి కావడం ప్రతిసారి అర్జున్ ఓడిపోయే సీన్స్ పిల్లలకు అంతగా నచ్చవు. యానిమేషన్ సినిమా కావడంతో డైరెక్టర్ లాజిక్స్ గురించి పెద్దగా పట్టించుకున్నట్టు లేడు అందుకే అక్కడక్కడా ఇది ఎంతవరకూ కరెక్ట్ అనే ఆలోచన వస్తుంది. స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ గా రాసుకోకపోవడం వల్ల సినిమా ఊహాజనితంగా ఉంటుంది.

సాంకేతిక విభాగం :

డైరెక్టర్ ఎంచుకున్న కథ పిల్లలకు బాగా నచ్చేలా ఉన్నా స్క్రీన్ ప్లే సరిగా రాసుకోలేదు. ముఖ్యంగా సెకండాఫ్ లో కాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. కనీసం ఎడిటర్ అయినా పట్టించుకోని కొన్ని సీన్స్ కత్తిరించి ఉంటే సినిమా ఇంకా బాగుండేది. దర్శకత్వం బాగుంది. రొసౌరొ బి. అడోరబల్ యానిమేషన్ డైరెక్షన్ ఓకే. సునీల్ కౌషిక్ యాక్షన్ సీక్వెన్సులకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, మిగతా అంతా సో సో గా ఉంది. చాలా చోట్ల డైలాగ్స్ బాగున్నాయి.

తీర్పు :

ఈ సమ్మర్లో చిన్నపిల్లలు చూడదగిన సినిమా ఛోటా భీమ్ అండ్ ది థ్రోన్ ఆఫ్ బాలి’. ఈ సినిమాకి రొసౌరో బి. అడోరబల్ అందించిన యానిమేషన్స్, ఫస్ట్ హాఫ్, చివరి 20 నిమిషాలు బాగుంది.సెకండాఫ్ నిధానంగా సాగడం, ఊహించే విధంగా సినిమా ఉండడం చెప్పదగిన మైనస్ పాయింట్స్. చివరిగా ఈ సినిమా ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం తీసింది కాబట్టి చిన్న పిల్లలు బాగానే ఎంజాయ్ చేస్తారు. మిగతా ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చదు కావున అటువైపు వెళ్ళకపోవడమే మంచిది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నగేష్ మేకల

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు