సమీక్ష : “దహనం” – ఎమోషన్స్ బాగున్నా ఆకట్టుకోదు

సమీక్ష : “దహనం” – ఎమోషన్స్ బాగున్నా ఆకట్టుకోదు

Published on Mar 31, 2023 9:02 PM IST
Dahanam Movie Review In Telugu

విడుదల తేదీ : మార్చి 31, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: ఆదిత్య ఓం, సోనీ రెడ్డి, ఎఫ్ ఎం బాబాయి, శాంతి చంద్ర, రాజీవ్ నాయక్

దర్శకుడు : ఆడారి మూర్తి సాయి

నిర్మాత: డా. సతీష్ కుమార్ పెతకంశెట్టి

సంగీత దర్శకుడు: సతీష్ కుమార్

సినిమాటోగ్రఫీ: ఎస్ రామ కృష్ణ

ఎడిటర్: జె.పి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 


ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ఓ చిన్న చిత్రం అందులోని తెలుగు రిలీజ్ కి ముందే పలు నేషనల్ అవార్డ్స్ గెలుచుకుని వస్తున్నట్టుగా స్టేట్మెంట్స్ తో వచ్చిన సినిమా “దహనం” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

ఇక కథలోకి వస్తే..ఈ సినిమా సెటప్ అంతా 1980 దశకంలో ప్లాన్ చేయగా ఓ గుడికి చెందిన పూజారి భరద్వాజ్ శాస్త్రి(ఆదిత్య ఓం) కథగా కనిపిస్తుంది. తాను ఆ పరమ శివునికి మహా భక్తుడు కాగా, విశాఖపట్నంకు చెందిన వాడ్రేవుపల్లి అనే ప్రాంతంలో భూపతి(శాంతి చంద్ర) గుడిలో తాను పూజారిగా పని చేస్తాడు. అయితే పరిణామాల రీత్యా ఆ గుడి సంపాదన నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. మరో పక్క ఆ గుడికి సంబంధించి భూపతి తో కొన్ని లీగల్ సమస్యలు దీనితో ఈ కష్టకాల సమయంలో భరద్వాజ శాస్త్రి తన కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాడు? తన భక్తి తనని గట్టెక్కిస్తుందా? అనే అంశాలకి సమాధానం తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో కొన్ని అంశాలు చాలా హార్డ్ హిట్టింగ్ గా అయితే కనిపిస్తాయి. ఇది వరకు చాలా సినిమాల్లో కొన్ని సున్నితమైన అంశాలను చూసే ఉంటాం అదే తరహాలో ఈ సినిమాలో కూడా కొన్ని సామజిక అంశాలకి సంబంధించి పలు ఎమోషనల్ సీన్స్ అయితే కనిపిస్తాయి. అలాగే అప్పటి నేటివిటీలో గుడిలోకి కొందరి విషయంలో వివక్షత లాంటి అంశాలు కూడా ఈ చిత్రంలో టచ్ చేశారు.

అలాగే వీటితో పాటుగా పలు నమ్మకాలకి సంబంధించి సన్నివేశాలు బాగున్నాయి. ఇక నటుడు ఆదిత్య ఓం మంచి నటనతో మంచి హావ భావాలు పలికించి తన రోల్ కి న్యాయం చేకూర్చాడు. అలాగే సీనియర్ నటుడు ఎఫ్ ఎం బాబాయ్ ఈ చిత్రంలో మంచి పాత్రలో కనిపించారు. తనపై ఎమోషన్స్ సీన్స్ కూడా బాగున్నాయి. ఇక తనతో పాటుగా సోనీ రెడ్డి, శాంతి చంద్ర, రాజీవ్ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేకూర్చారు.

 

మైనస్ పాయింట్స్ :

మొదటగా ఈ సినిమాలో కనిపించే నేపథ్యం లో ఎలాంటి కొత్తదనం ఉండదు ఇప్పటికీ కూడా పలు చిత్రాల్లో ఈ తరహా కాన్సెప్ట్ లు చిన్న చిన్న సీన్స్ లో అయినా చూస్తాం. అయితే దాదాపు పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సినిమాల్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి. అదే విధంగా మొదట్లో చెప్పుకున్నట్టుగా ఆల్రెడీ ఈ తరహా పాయింట్స్ అనే మాట వచ్చినపుడు ఓ సినిమా “1947 లో ఒక గ్రామం” అనే సినిమా కూడా గుర్తు రాక మానదు.

ఆ సినిమాలో చూపించిన కొన్ని వివక్షత సీన్స్ తరహాలో ఇందులో కూడా కనిపిస్తాయి. ఇక వీటితో పాటుగా ఈ సినిమాలో పలు సీన్స్ బాగా రిపీట్డ్ గా అనిపిస్తాయి. దీనితో ఒకింత బోర్ ఫీల్ కలుగుతుంది. అలాగే నరేషన్ మరింత ఆసక్తిగా మలచాల్సింది. ఇక కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకునే వారు కూడా డిజప్పాయింట్ అవ్వొచ్చు.

 

సాంకేతిక వర్గం :

ఈ సినిమాకి నిర్మాణ విలువలు పర్వాలేదని చెప్పాలి. అలాగే టెక్నీకల్ టీం లో అయితే సతీష్ కుమార్ మ్యూజిక్ పర్వాలేదు. అలాగే రామ కృష్ణ సినిమాటోగ్రఫీ 80వ దశకంలో వాతావరణం ని అయితే రీ క్రియేట్ చేశారు. అలాగే సినిమాలో డైలాగ్స్ వర్క్ బాగుంది. ఇక ఎడిటింగ్ అయితే ఇంకొంచెం బెటర్ గా చేయాల్సింది.

ఇక దర్శకుడు ఆడారి మూర్తి సాయి విషయానికి వస్తే..తాను అనుకున్న పాయింట్ లో పలు సన్నివేశాలు బాగా ప్రెజెంట్ చేశారు. కానీ స్క్రీన్ ప్లే ఇంకా బెటర్ గా చేయాల్సింది. అలాగే నటీనటులు నుంచి మంచి పెర్ఫామెన్స్ లను తాను రాబట్టడంలో సక్సెస్ అయితే అయ్యారు.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “దహనం” లో కొన్ని సోషల్ ఎలిమెంట్స్ బాగుంటాయి. మంచి ఎమోషన్స్ నటీ నటుల పెర్ఫామెన్స్ లు బాగున్నాయి. కానీ సినిమాలో మరీ అంత కొత్తదనం కూడా కనిపించదు. వీటితో పాటుగా సినిమా కాస్త స్లో గా ఉండడంతో అయితే సినిమాపై అంత ఆసక్తి రాదు. వీటితో అయితే ఈ సినిమా జస్ట్ బిలో యావరేజ్ గా అనిపిస్తుంది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు