సమీక్ష : డియర్ చూడాలంటే డేర్ చేయాల్సిందే

సమీక్ష : డియర్ చూడాలంటే డేర్ చేయాల్సిందే

Published on Feb 4, 2012 7:30 AM IST
విడుదల తేది : 03  ఫిబ్రవరి 2012
123తెలుగు.కాం రేటింగ్: 2/5
దర్శకుడు : కుమారవేల్
నిర్మాత : కిషోర్ నాయుడు  ఆరిగేల
సంగిత డైరెక్టర్ : విజయ్  అంటోనీ
తారాగణం : భరత్ , అమీర్  సుల్తాన్ , రిమ  కల్లింగాల్

భరత్ హీరోగా రీమా కల్లింగల్ హీరొయిన్ గా తమిళంలో ‘యువన్ యువన్’ పేరుతో గత సంవత్సరం విడుదలైన చిత్రాన్ని తెలుగులో ‘డియర్’ పేరుతో విడుదల చేసారు. మాత మీడియా బ్యానర్ పై కిషోర్ నాయుడు అరిగెల ఈ చిత్రాన్ని విడుదల చేసారు. కుమరవేలన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి విజయ్ అంటోనీ సంగీతం అందించారు. డియర్ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజే విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:

కళ్యాణ్ కృష్ణ (భరత్) హైదరాబాదులోని సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ అమెరికా వెళ్లి స్థిరపడాలని ప్రయత్నిస్తుంటాడు. నిషా (రీమా కల్లింగల్) కూడా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటుంది. పాస్ పోర్ట్ ఆఫీసులో కలుసుకున్న కళ్యాణ్, నిషా మొదట్లో కొట్టుకున్న తరువాత స్నేహితులుగా మారతారు. నిషాని ప్రేమించిన కళ్యాణ్ ఆమెని పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళాలనుకుంటాడు. మరోవైపు అనకాపల్లిలో ఉండే కళ్యాణ్ తండ్రి అయిన చిలుకుల పుల్లారావు (సంపత్) మాత్రం కళ్యాణ్ కి తనకి నచ్చిన అమ్మాయినిచ్చి పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తాడు. నిషాతో కలిసి తన కొడుకు కళ్యాణ్ అమెరికా వెల్లిపొతున్నాడని తెలుసుకున్న పుల్లారావు నిషాని కిడ్నాప్ చేసి కళ్యాణ్ బలవంతంగా అనకాపల్లి తీసుకెళ్తాడు. నిషా అసలు కళ్యాణ్ ని ప్రేమించిందా? నిషా అమెరికా ఎందుకు వెళ్ళాలనుకుంది? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే డియర్ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

అనకాపల్లిలో పుట్టి అమెరికా వెళ్లాలనుకునే కళ్యాణ్ పాత్రలో భరత్ బాగా నటించాడు. విదేశాలలో తీసిన సన్నివేశాల్లో స్టైలిష్ గా అందంగా ఉన్నాడు. డాన్సులు కూడా బాగా చేసాడు. రీమా కల్లింగల్ అందంలో పాస్ మార్కులు దక్కించుకోగా నటనలో మాత్రం సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. కళ్యాణ్ తండ్రి పుల్లారావుగా సంపత్ చాలా బాగా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ముందు సన్నివేశాల్లో అధ్బుతంగా నటించాడు. చంటి పాత్రలో నటించిన సంతానం కొంతవరకు నవ్వించాడు. అతను చిత్ర రెండవ భాగంలో ఫుల్ లెంగ్త్ పాత్రలో నటించాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బావుంది.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రం తమిళ్లోనే నిరాశ పరచింది. డబ్బింగ్ విషయంలో ఏమాత్రం శ్రద్ధ తీసుకోలేదు. విజయ్ అంటోనీ సంగీతంలో ఒక్క పాట తప్ప మిగతా పాటలన్నీ చిరాకు తెప్పిస్తాయి. చిత్ర కథంతా మొదటి భాగంలో చెప్పి రెండవ భాగం అంతా సాగదీసాడు. సత్యన్ కామెడీ నవ్వించకపోగా చిరాకు తెప్పిస్తుంది. అనకాపల్లిలో చూపించే పాత్రలన్నీ అతిగా ప్రవర్తిస్తుంటాయి. క్లైమాక్స్ ముందు సన్నివేశాలు బొమ్మరిల్లు సినిమాని పోలి ఉన్నాయి. ఫైట్స్ కూడా అనవసరంగా ఏదో మాస్ ప్రేక్షకుల కోసం పెట్టినట్లుగా ఉన్నాయి.

సాంకేతిక విభాగం:

ఎడిటింగ్ లోపాలు చాలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ అయితే లైటింగ్ లేక చాలా డల్ గా ఉంది. డైలాగుల గురించి చెప్పుకోకపోవడమే మంచిది అంత గొప్పగా ఉన్నాయి మరి. దర్శకుడు తీసుకున్న కథ బావున్నప్పటికీ స్క్రీన్ప్లే విషయంలో మాత్రం తేలిపోయాడు.

తీర్పు:

చిత్ర మొదటి భాగం కొంత బాగానే ఉన్నప్పటికీ రెండవ భాగం మాత్రం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. తమిళ్లోనే ఫ్లాప్ అయిన సినిమా అనుకున్నారో ఏమో తెలియదుగాని డబ్బింగ్ విషయంలో కూడా ఏ మాత్రం శ్రద్ధ తీసుకోకుండా ప్రేక్షకుల మీదకి వదిలారు.

123తెలుగు.కామ్ రేటింగ్: 2/5

అశోక్ రెడ్డి. ఎమ్

Clicke Here For Dear English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు