సమీక్ష : ధీమహి – డల్ గా సాగే రివేంజ్ యాక్షన్ డ్రామా !

సమీక్ష : ధీమహి – డల్ గా సాగే రివేంజ్ యాక్షన్ డ్రామా !

Published on Oct 27, 2023 7:00 PM IST
Dhimahi Movie Review in Telugu

విడుదల తేదీ : అక్టోబరు 27, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: సాహస్ పగడాల, నిఖిత చోప్రా, సౌజన్య, శ్రీజిత్ గంగాధరన్, ఆషిక పగడాల తదితరులు.

దర్శకుడు : సాహస్ పగడాల, నవీన్ కంటె

నిర్మాత: విరాట్ కపూర్, సాహస్ పగడాల

సంగీతం: షారోన్ రవి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

సాహస్ పగడాల హీరోగా ‘ధీమహి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జయ జయ హే మహిషసుర మర్ధిని అనే టాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమాను కెప్టెన్ కుక్ ఫిలిమ్స్ బ్యానర్ పై విరాట్ కపూర్, సాహస్ పగడాల సంయుక్తంగా నిర్మించారు. నవీన్ కంటె, సాహస్ పగడాల డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

కార్తీక్(సాహస్) అమెరికాలో ఒక సక్సెస్ ఫుల్ సర్జన్. ఐతే, కార్తీక్ కి తన అక్క మైత్రి(సౌజన్య) కుమార్తె ధీమహి అలియాస్ మహి(ఆషిక పగడాల) అంటే ప్రాణం. ఆ పాపలో చనిపోయిన తన తల్లిని చూసుకుంటూ ఉంటాడు. అంతా హ్యాపీగా జరిగిపోతున్న కార్తీక్ లైఫ్ లో అనుకోని కష్టాలు వచ్చి పడతాయి. మహి అనూహ్యంగా కిడ్నాప్ అవుతుంది. ఆమెను కిడ్నాప్ చేసిన వ్యక్తి ఆమెను చంపేయడంతో కుటుంబం అంతా విషాదంలో మునిగిపోతుంది. అసలు తన మేనకోడలను చంపిన వ్యక్తి ఎవరు ? అని తెలుసుకోవడానికి కార్తీక్ చాలా ప్రయత్నాలు చేస్తాడు. నెక్రోమాన్సీ అనే పద్దతితో తన మేనకోడలి ఆత్మతో మాట్లాడి ఆమె మరణానికి కారణమైన వ్యక్తిని చంపాలని అనుకుంటాడు. ఇంతకీ కార్తీక్ తాను అనుకున్నది సాధించాడా ?, లేదా ?, ఈ మధ్యలో కార్తీక్ తో నిధి(నిఖిత చోప్రా) ప్రేమ కథ ఎలా సాగింది ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

చనిపోయిన వారి ఆత్మలతో మాట్లాడడం అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ఎమోషనల్ రివేంజ్ డ్రామాలో కొన్ని ఎమోషన్స్ అండ్ మెయిన్ కథాంశం బాగున్నాయి.అలాగే సినిమాలో కోర్ పాయింట్ బాగుంది. చనిపోయిన తన మేనకోడలను కలుసుకుని ఎవరు చంపారో తెలుసుకుని, వారిని చంపేయాలనే కోణంలో సాగిన ఈ కథ మొత్తానికి కొన్ని చోట్ల ఆకట్టుకుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన సాహస్ పగడాల పాత్ర .. ఆ పాత్రకి సంబంధించిన ఎమోషనల్ ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన ఆషిక పగడాల పాత్ర.. ఆమెకు జరిగిన అన్యాయం, దానికి సాహస్ పగడాల రివేంజ్ జర్నీ ఇలా మొత్తానికి ‘ధీమహి’ సినిమా కొన్ని చోట్ల పర్వాలేదు.

ముఖ్యంగా ఎమోషన్స్ తో సాగే కొన్ని యాక్షన్ సీన్స్ అండ్ మిగిలిన సీక్వెన్స్ లు పర్వాలేదు. ఈ సినిమాలో హీరోగా నటించిన సాహస్ తన పాత్రకు తగ్గట్లు బాగానే నటించాడు. హీరోయిన్ నిఖిత చోప్రా తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. అలాగే, మరో కీలక పాత్రలో నటించిన శ్రీజిత్ గంగాధరన్ కూడా బాగానే నటించాడు. తల్లి పాత్రలో సౌజన్య నటన బాగుంది. మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

దెయ్యాలు, ఆత్మలు కథలు తెలుగు సినిమాకి కొత్తేమీ కాదు. దీనికి తోడు హారర్ ఎఫెక్ట్స్ కూడా బాగా రెగ్యులర్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో అలాంటి ఓ నేపథ్యంలో ఈ ధీమహి టీమ్ వచ్చింది. అసలు చనిపోయిన తన మేనకోడలను కలుసుకుని ఆమెను ఎవరు చంపారో తెలుసుకోవడానికి హీరో విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. కానీ, తీరా ఆమెను కలుసుకున్న తర్వాత, ఆ అంశాన్ని టచ్ చేసి, ప్రాపర్ ఎండింగ్ ఇచ్చి ఉండి ఉంటే.. అసలు కథలోని మెయిన్ మోటివ్ బాగా వర్కౌట్ అయ్యి ఉండేది. కానీ అలా జరగలేదు.

అలాగే, ఈ ‘ధీమహి’లో కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే కాన్ ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం, ఇక మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు హీరో సాహస్ క్యారెక్టర్ తాలూకు గ్రాఫ్ కూడా బాగాలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. అయితే దర్శకులు ఫస్ట్ హాఫ్ పై ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ… అదే విధంగా వారు రాసుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ.. సినిమాలో కొన్ని చోట్ల లాజిక్ మిస్ కావడం, ఇంట్రెస్టింగ్ ప్లే లేకపోవడం అంశాల కారణంగా సినిమా బాగాలేదు. మొత్తమ్మీద దర్శకులు ఈ సినిమాని ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తర్వాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశారు.

 

సాంకేతిక విభాగం :

సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథనం ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు షారోన్ రవి సమకూర్చిన పాటలు పర్వాలేదు. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ సీన్స్ ను తెరకెక్కించిన విధానం బాగుంది. ఎడిటింగ్ కూడా బాగాలేదు. ఈ చిత్ర నిర్మాతలు విరాట్ కపూర్, సాహస్ పగడాల పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు:

‘ధీమహి’ అంటూ వచ్చిన ఈ హారర్ రివేంజ్ డ్రామాలో కొన్ని సెంటిమెంట్ సీన్స్ అండ్ కొన్ని ఎమోషన్స్ పర్వాలేదు. ఐతే, కథాకథనాలు స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమా కనెక్ట్ కాదు.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు